ఒవెన్ కొంటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి?
కేక్, బిస్కట్లు తయారీ కోసం మైక్రోవేవ్ ఒవెన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే వీటిలో చాలా రకాలు ఉంటాయి.
By అంజి
ఒవెన్ కొంటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి?
కేక్, బిస్కట్లు తయారీ కోసం మైక్రోవేవ్ ఒవెన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఎటువంటి ఒవెన్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఒవెన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా పని చేస్తుంది. ఈ వేవ్స్‌ను గ్రహించి ఆహారం మొత్తం వేడెక్కుతుంది. ఇందులో ప్లాస్టిక్, సిరామిక్, సిలికాన్, గ్లాస్ మాత్రమే ఉపయోగించాలి. వాటిపై మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటేనే వాడాలి.
మైక్రోవేవ్ ఒవెన్లలో మూడు రకాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే మోసపోతాం. మైక్రోవేవ్‌లలో గ్రిల్, సొలో, కన్వెక్షన్ అనే రకాలు ఉంటాయి. సోలో మైక్రో ఒవెన్ కేవలం ఆహారాన్ని ఉడికిస్తుంది. రీహీట్ మాత్రమే చేస్తుంది. ఇందులో కేక్, బ్రెడ్, పిజ్జా, బిస్కెట్లు తయారు చేయలేం. ఆహారం గ్రిల్ చేయడం కూడా సాధ్యం కాదు. కన్వెక్షన్ ఓవెన్‌లో మాత్రం.. బ్రెడ్, పిజ్జాతో పాటు అన్ని రకాల వంటకాలను క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు. గ్రిల్ కేవలం ఆహారాన్ని వేడి చేయడానికి మాత్రమే పని చేస్తుంది. కన్వెక్షన్ మైక్రోవేవ్ ఆహారంలో ఉండే అణువుల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీని వల్ల అణువుల వల్ల మధ్య రాపిడి ఏర్పడి హీట్ ఏర్పడుతుంది. దీంతో ఆహారం లోపలి నుంచి ఉడుకుతుంది.