'టీ' లో అల్లం, దాల్చిన చెక్క పొడి వేస్తున్నారా?

ఉదయం 'టీ' తాగడం చాలా మందికి అలవాటు. ఎక్కువ మంది టీని సాధారణంగా టీ పౌడర్‌, పాలు, నీళ్లతో చేస్తుంటారు.

By అంజి
Published on : 28 March 2025 11:13 AM IST

ginger, cinnamon powder, tea, Lifestyle

'టీ' లో అల్లం, దాల్చిన చెక్క పొడి వేస్తున్నారా?

ఉదయం 'టీ' తాగడం చాలా మందికి అలవాటు. ఎక్కువ మంది టీని సాధారణంగా టీ పౌడర్‌, పాలు, నీళ్లతో చేస్తుంటారు. అయితే వీటికి మరికొన్ని పదార్థాలను కలిపి టీ తయారు చేస్తే మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మరింత మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

'టీ' తయారు చేసేటప్పుడు అల్లాన్ని దంచి అందులో వేసి బాగా మరిగించాలి. ఇలా చేసిన టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్లంలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధకశక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. సీజనల్‌ వ్యాధుల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది.

'టీ' తయారు చేస్తున్నప్పుడు దానిలో కాస్తా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే మంచి రుచితో పాటు ఆరోగ్యం మన సొంతం అవుతుంది. దాల్చిన చెక్క పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దాల్చిన చెక్క పొడిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.

Next Story