ఏపీ సర్కార్‌కు షాక్‌.. సెలక్ట్‌ కమిటీలో ఐదుగురు టీడీపీ సభ్యులకు చోటు

By సుభాష్  Published on  26 Jan 2020 5:09 PM IST
ఏపీ సర్కార్‌కు షాక్‌.. సెలక్ట్‌ కమిటీలో ఐదుగురు టీడీపీ సభ్యులకు చోటు

ఏపీలో జగన్‌ సర్కార్‌కు శాసనమండలి షాకిచ్చింది. సెలక్ట్‌ కమిటీలో ముందడుగు వేసింది. శాసనసభ ఆమోదించిన అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ రెండు బిల్లులకు రెండు సెలక్ట్‌ కమిటీలను శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఒక్కో సెలక్ట్‌ కమిటీలో 9 మంది సభ్యులుంటారని షరీఫ్‌ వివరించారు.

ఇక కమిటీకి సంబంధిత బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఇందులో ఐదుగురు టీడీపీ సభ్యులు, ఒక వైసీపీ, ఒక పీడీఎఫ్‌, ఒక బీజేపీ సభ్యులున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు మీద ఏర్పాటయ్యే కమిటీకి మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్‌, సీఆర్డీఏ రద్దు బిల్లు మీద ఏర్పాటయ్యే సెలక్ట్‌ క మిటీకి మంత్రి బోత్స సత్యనారాయణ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. కాగా, ఈ కమిటీల్లో సభ్యులను సూచించాల్సిందిగా ఆయా పార్టీలకు శాసన మండలి చైర్మన్‌ కార్యాలయం కోరింది. కమిటీ సభ్యులను ప్రతిపాదించిన తర్వాతే పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పాటు కానుంది.

Next Story