ఎల్బీనగర్ అండర్ పాస్.. కామినేని ఫ్లైఓవర్ ప్రారంభం
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 11:11 AM GMT
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కామినేని జంక్షన్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్, అండర్‌పాస్ బ్రిడ్జిలను గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ లు కలిసి ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల గుండా ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఎల్బీనగర్ జంక్షన్‌లో రూ.14కోట్ల వ్యయంతో అండర్ పాస్ ను నిర్మించగా.. కామినేని ఫ్లైఓవర్‌ను రూ.43కోట్ల వ్యయంతో నిర్మించారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో నాగోల్ నుంచి ఎల్బీనగర్‌కు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అండర్‌పాస్‌తో ఓవైసీ జంక్షన్, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్‌లో ఫ్లైఓవర్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఎల్బీనగర్‌లో ఫ్లైఓవర్, అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ల్బీనగర్ రింగ్‌రోడ్డు సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మారింది. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.