మరోమారు తన ఉదారతను చాటుకున్న లారెన్స్‌ భారీ విరాళం

By సుభాష్
Published on : 9 April 2020 6:25 PM IST

మరోమారు తన ఉదారతను చాటుకున్న లారెన్స్‌ భారీ విరాళం

ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తనవంతు సాయంగా రూ.3 కోట్ల విరాళంగా ప్రకటించారు. అందులో పీఎం -కేర్స్‌ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 50 లక్షలు, డ్యాన్సర్‌ యూనియన్‌కు రూ. 50 లక్షలు, పెప్సీ యూనియన్‌కు రూ. 50 లక్షలు అలాగే తన దగ్గర ఉన్న దివ్యాంగులకు రూ 25 లక్షల చొప్పున ప్రకటించారు.

అంతేకాదు సొంత గ్రామమైన రోయపురానికి చెందిన రోజువారీ కూలీలకు, ప్రజల కోసం రూ.75 లక్షలు ప్రకటిస్తున్నట్లు లారెన్స్‌ పేర్కొన్నారు. కాగా, తన తర్వాత సినిమా కోసం అందే అడ్వాన్స్‌ నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Next Story