ఆ హీరోయిన్ కు ఎంత కష్టమొచ్చిందో.. ఆరునెలల తర్వాత తల్లిదండ్రుల వద్దకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 12:52 PM GMT
ఆ హీరోయిన్ కు ఎంత కష్టమొచ్చిందో.. ఆరునెలల తర్వాత తల్లిదండ్రుల వద్దకు

లాక్ డౌన్ అన్నది ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. చాలా మంది జీవితమంటే కూడా నేర్పింది. లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొనైనా సొంత ఊరికి వచ్చేయాలని కొందరు అనుకోగా.. ఎలాంటి ఇబ్బందిని అయినా సొంత వాళ్ళతో ఉంటే దాటేయొచ్చని నేర్పించింది.

మరికొందరు లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళను కలవడానికి అవకాశం లేక ఇబ్బందులు పడిన వారు కొందరైతే.. బయట ఎక్కడి నుండో తన వాళ్ల దగ్గరకు వెళితే వారికేమైనా అవుతుందేమోనని మరికొందరు భయపడ్డారు.

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా అలాంటి కష్టమే వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఆమె తల్లిదండ్రులకు దూరంగానే ఉంటూ వచ్చింది. ఆ విషయాన్ని తన అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత లావణ్య త్రిపాఠి తన కుటుంబ సభ్యుల చెంతకు వెళ్ళింది. ఆ విషయాన్ని లావణ్య సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. లావణ్య స్వస్థలం డెహ్రాడూన్.. జనవరిలో ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన లావణ్య.. ఆ తర్వాత లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ లోనే వుంది. దాదాపు ఆరు నెలల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసేందుకు లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ ఈ నెలలో వెళ్లింది.

డెహ్రాడూన్ ప్రయాణంకు నేను మొదట భయపడ్డాను. పీపీఈ కిట్ మరియు జాగ్రత్తలు పాటించి డెహ్రాడూన్ చేరుకున్నాను. చేరుకున్న వెంటనే కరోనా టెస్టు చేయించుకున్నాను. నెగటివ్ వచ్చినా కూడా కుటుంబ సభ్యులకు కాస్త దూరంగానే ఉన్నానని చెప్పింది. తాను వెళ్లాలని అనుకుని ఉంటే లాక్ డౌన్ మొదలైన సమయంలోనే వెళ్లి ఉండేదాన్నని.. కానీ తన డిజైనర్ ఫ్రెండ్ తో కలిసి మాస్కులు తయారు చేశానని తెలిపింది. నా పెట్ బ్రూనిను కూడా బాగా మిస్ అయ్యానని చెప్పింది. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతోనే తాను వెళ్ళడానికి భయపడ్డానని తెలిపింది లావణ్య. ఇప్పుడు ఇంట్లో కూడా తాను మాస్కు వేసుకుని తిరుగుతున్నానని చెప్పింది.

డెహ్రాడూన్ ఎంత అందమైనదో దాదాపుగా మరచిపోయానని... మాకు రూఫ్ టాప్ జిమ్ ఉందని.. చుట్టూ కొండలు.. ఎంతో అందమైన ప్రాంతమని చెప్పుకొచ్చింది. తాను తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారని.. మా అమ్మ మంచి మంచి వంటకాలన్నీ చేస్తోందని తెలిపింది లావణ్య.

Next Story