మంత్రి కేటీఆర్‌ను కలిసిన క్రికెట్ లెజెండ్.. ఎందుకంటే..?
By అంజి Published on 25 Nov 2019 2:05 PM IST
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశమ్రల శాఖ మంత్రి కేటీఆర్‌ను లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఇవాళ ఉదయం జీఎహ్‌ఎంసీ ఆఫీసులో కేటీఆర్‌ను కలిసిన కపిల్ దేవ్ పలు అంశాలపై చర్చించారు. డిసెంబర్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి కేటీఆర్‌ను కపిల్‌దేవ్ కోరారు. గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ భేటీలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాబ ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నీ జరగనుంది. టోర్నీలో కపిల్ దేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గత కొంత కాలంగా గోల్ఫ్‌ను కపిల్ దేవ్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. 2015 నుంచి గోల్ఫ్‌లో కపిల్‌దేవ్ ఎంతో పరిణీతిని సాధించాడు. కిందటేడాది ఆసియా ఫసిఫిక్ సీనియర్ గోల్ఫ్ టోర్నీకి సంబంధించి భారత్ జట్టులో సెలెక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యంలోకి తీసుకెళ్లింది.