భారత్‌లో 24గంటల్లో 86వేల కేసులు..1141 మరణాలు
By తోట వంశీ కుమార్Published on : 25 Sept 2020 10:37 AM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 86,052 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటివరకు 47,56,165 మంది కోలుకున్నారు. కాగా.. 9,70,116 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 81శాతం ఉండగా.. మరణాల రేటు 1.59శాతంగా ఉంది.
Also Read
విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం..!నిన్న ఒక్క రోజే 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 92,290కి చేరింది. నిన్న ఒక్కరోజులోనే 14,92,409 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 6,89,28,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
Next Story