భారత్‌లో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. వరుసగా రెండో రోజు 60వేలు దాటిన కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 5:56 AM GMT
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. వరుసగా రెండో రోజు 60వేలు దాటిన కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 933 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 42,518 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 14,27,006 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 6,19,088 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

భారత్‌లో రికవరీ రేటు 68.32శాతంగా ఉండగా.. మరణాలు రేటు 2.04 శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 5,98,778 శాంపిల్స్‌ను పరీక్షించగా.. మొత్తంగా 2,33,87,171 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదవ స్థానంలో కొనసాగుతోంది.

Next Story