భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,117 కేసులు నమోదు కాగా.. 764 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,95,988 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 10,94,374 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,65,103 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశంలో రికవరీ రేటు 64.53శాతంగా ఉంది. ఈ మహమ్మారి భారిన పడి 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 2.15శాతంగా ఉంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీల్లో అత్య‌ధిక క‌రోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజు 5,25,689 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,93,58,659 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.