భారత్‌లో 24 గంటల్లో 52,050కేసులు.. 803 మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2020 10:35 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 52,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 803 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల్లో 12,30,510 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,86,298 మంది వివిధ ఆస్నత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారీన పడి మృతి చెందిన వారి సంఖ్య 38,938కి చేరింది. ఇక దేశంలో రికవరీ రూటు 65.77శాతంగా ఉండగా.. మరణాలు రేటు 2.11శాతంగా ఉంది.
నిన్న ఒక్కరోజులో 6,61,182 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 2,08,64,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో నమోదు అవుతున్నాయి. అత్యధిక మరణాలు సైతం మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. నిన్న 250 మంది మృతి చెందగా.. మొత్తంగా 15,700 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడు, దిల్లీలలో కూడా 4వేలకు పైగా మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఐదో స్థానంలో ఉంది.