లైలా రీ ఎంట్రీ. ఇంత‌కీ.. ఏ సినిమాతో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 10:57 AM GMT
లైలా రీ ఎంట్రీ. ఇంత‌కీ.. ఏ సినిమాతో..?

లైలా అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే సినిమా ఎగిరే పావుర‌మా. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ తెర‌కెక్కించి..వ‌రుస విజ‌యాలు అందించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ద్వారానే లైలా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించ‌డంతో పాటు కుర్ర‌కారు మ‌న‌సుల‌ను ఎంత‌గానో దోచుకుంది ఈ అమ్మ‌డు.

ఉగాది, పెళ్లిచేసుకుందాం, పవిత్రప్రేమ, ల‌వ్ స్టోరీ 1999 త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించి అప్పట్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒక్క తెలుగులోనే కాదండోయ్ తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. 2006 తర్వాత లైలా స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు.

ఇటీవ‌ల ఓ ఎంట‌ర్ టైన్మెంట్ ఛాన‌ల్ కి లైలా ఇంట‌ర్ వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్ వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ... సినిమాతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. అంతే కాదండోయ్.. తాను మళ్లీ టాలీవుడ్, కోలీవుడ్‌లోకి ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం త‌ను న‌టించ‌బోయే సినిమాకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే... ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది..? హీరో ఎవ‌రు..? ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? అనేది మాత్రం చెప్ప‌లేదు. ఈ వివ‌రాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Next Story
Share it