తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ హత్యపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ హత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ హైదరాబాద్ కు ఓ ప్ర‌త్యేక‌ టీంను పంపింది. ఈ రోజు సాయంత్రం లోగా ప్ర‌త్యేక టీం హైదరాబాద్ చేరుకోనుంది. అనంత‌రం హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జర‌ప‌నుంది.

నిన్న‌ షాద్‌నగర్‌ సమీపంలో జ‌రిగిన వెటర్నరీ డాక్టర్ వెట‌ర్న‌రీ వైద్యురాలు హత్య కలకలం రేపింది. షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.