మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు: మోదీ

By సుభాష్  Published on  3 July 2020 9:18 AM GMT
మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు: మోదీ

సైనికుల ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని, దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుందని ప్రధాన నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం చీఫ్‌ అఫ్‌ డిఫెన్స్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌తో కలిసి లడఖ్ లేహ్‌లో పర్యటించిన మోదీ.. సరిహద్దు పరిస్థితులపై సైనికులతో సమీక్ష జరిపారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో నీమ్‌లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైనికులనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చారు. లడఖ్‌ నుంచి కార్గిల్‌ వరకు మీ ధైర్యం అమోఘమన్నారు. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ దేశం కోసం పని చేస్తున్నారని కొనియాడారు.

భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని, భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్‌ అన్నారు. భారత శతృవులకు గట్టి గుణపాఠం నేర్పారని, ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని అన్నారు. శాంతిపై భారత్‌కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించిందని, జవాన్ల త్యాగం నిరూపమానమైనదని, ఆధునిక సాంకేతికతను, అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నామని అన్నారు. కాగా, ప్రధాని మోదీ సరిహద్దు పర్యటనతో చైనా షాక్‌కు గురైంది. లడఖ్‌ ఆకస్మిక పర్యటనతో మోదీ ప్రపంచాన్ని ఆశ్చర్పరిచారు.

శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోం.. అని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేశామన్నారు. ప్రతి పోరాటంలో విజయం మనదే అన్నారు.



Next Story