పెంపుడు కుక్క‌తో ప్రాక్టీస్‌.. వీడియో వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 8:29 AM GMT
పెంపుడు కుక్క‌తో ప్రాక్టీస్‌.. వీడియో వైర‌ల్‌

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌స్తుతం క్రీడాకారులంతా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానుల‌తో చిట్ చాట్‌లు చేస్తున్నారు. కొంద‌రు క్రికెట‌ర్లు త‌మ ఫిట్‌నెస్ పోకుండా ఉండేందుకు ఇంట్లోనే జిమ్ చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బ‌య‌టికి వ‌చ్చి ఆడే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో క్రికెట్ ఆడ‌డానికి వివిధ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. తాజాగా మార్న‌స్ ల‌బుషేన్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ల‌బుషేన్ త‌న ఇంటి పెర‌టిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఓ వ్య‌క్తి బాల్‌ను త్రో డౌన్ చేయ‌గా.. ల‌బుషేన్ ఆ బంతుల‌ను ఆడాడు. ఇందులో విశేషం ఏంటంటే.. వికెట్ కీపింగ్‌ను ల‌బుషేన్ పెంపుడు కుక్క చేసింది. వెన‌క్కి వెల్లిన బంతిని తీసుకుని వ‌చ్చింది. ఈ వీడియోను బ్రిస్బేన్ హీట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో ల‌బుషేన్ బ్రిస్బేన్‌కు ప్రాతినిత్యం వ‌హిస్తున్నాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. సూప‌ర్‌డాగ్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేయ‌గా.. ఆస్ట్రేలియ‌న్ టీమ్‌కి మ‌రో మంచి ప్లేయ‌ర్ దొరికింది అంటూ మ‌రో అభిమాని కామెంట్ చేశారు.

కాగా.. ఇటీవ‌లే న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్ సన్ త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌గా.. అత‌ని పెంపుడు శున‌కం స్లిప్‌లో ఫీల్డింగ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది.

Next Story
Share it