కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

By సుభాష్
Published on : 31 March 2020 8:28 AM IST

కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైత్లపూర్‌ డంపింగ్‌ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో రెండు వాహనాలు దగ్దమయ్యాయి. డంపింగ్‌ యార్డ్‌లో నిల్వ ఉన్న చెత్తతో పాటు యార్డు భవనం పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story