కరోనాపై వాస్తవాలను గ్రహించాలి: మంత్రి కేటీఆర్‌

By సుభాష్  Published on  4 May 2020 8:00 AM GMT
కరోనాపై వాస్తవాలను గ్రహించాలి: మంత్రి కేటీఆర్‌

కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయకుంటే పెద్ద ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..కరోనా వైరస్‌తో కలిసి జీవించడం ఎలాగో నేర్చుకోవాలని, కరోనాపై వాస్తవాలను గ్రహించాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో లేదన్న విషయం ప్రతీ ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

పరిశ్రమలను ఆకర్షించడం కోసం వసతుల కల్పనకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరింత సాయం అందించాలని కేటీఆర్‌ కోరారు. అలాగే ఫార్మాసిటీ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కార్‌ కేంద్రాన్ని రూ. 4వేల కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

కరోనాను కట్టడి లో భారత్‌ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయని, కరోనా వైరస్‌ కట్టడిలో గానీ, లాక్‌డౌన్‌ పాటించడంలో గానీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ పనితీరు బాగుందన్నారు.

Next Story