లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. ఈదిబజార్‌లో పరస్పరం ఒకరపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలులో ఉన్నా లెక్కచేయకుండా ఘర్షణకు దిగుతూ హంగామా సృష్టించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన యువకులపై భవానీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-04-at-8.08.51-AM.mp4"][/video]

సుభాష్

.

Next Story