మారిన కేటీఆర్ స్టైల్.. రోజుకో మాస్కుతో అందరి అటెన్షన్

By సుభాష్  Published on  12 July 2020 6:02 AM GMT
మారిన కేటీఆర్ స్టైల్.. రోజుకో మాస్కుతో అందరి అటెన్షన్

మిగిలిన వారి మాదిరి ఒకేలా ఉంటే మంత్రి కేటీఆర్ ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? ఆ మధ్య వరకు మాస్కుల వినియోగంలో యువనేత అంత అలెర్టుగా ఉండేవారు కాదు. ఇటీవల కాలంలో ఆయనలో చాలానే మార్పు వచ్చింది. గతంలో మాస్కుల్ని ధరించే విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు మొత్తంగా మారిపోయారు.

మాస్కు లేకుండా బయటకు రావటం లేదు. ఈ మధ్యన మాస్కు లేనోళ్లు తన చుట్టూ ఉంటే.. వారంతా మాస్కులు పెట్టుకోవాలని ఆయన ప్రత్యేకంగా సూచిస్తున్నారు. మిగిలిన వారి మాదిరి సింగిల్ లేయర్ మాస్కుల్ని కాకుండా.. తాను ధరించే మాస్కుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేటీఆర్.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఆయన మాస్కుల విషయంలో ప్రదర్శిస్తున్న శ్రద్ధ పలువురిని ఆయన వైపునకు తిప్పుకేనేలా చేస్తున్నారు. రోజుకో తరహా మాస్కు పెట్టుకోవటమే కాదు.. పలు డిజైన్ల మాస్కుల్ని ఆయన ధరిస్తున్నారు. చూస్తుంటే..ప్రత్యేకంగా క్లాత్ తో చేయించిన మాస్కుల్ని ఆయన ధరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చుట్టు ఉన్న వారంతా మాస్కులు పెట్టుకున్నామంటే.. పెట్టకున్నామన్నట్లుకాకుండా.. వారికి భిన్నంగా కేటీఆర్ మాత్రం ఉన్నారనిచెప్పాలి.

చాలామంది ప్రజాప్రతినిధులు మాస్కు ముఖానికి పెట్టుకున్నా.. ముఖం మొత్తాన్ని కవర్ చేయకుండా ఉండటం.. ముక్కు కిందకు పెట్టుకునే వారు కొందరైతే.. నోటి కిందకు మాస్కుని తగిలించుకునే వారు మరికొందరు. తాజాగా ఇందిరాపార్కు వద్ద స్టీల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. చుట్టూ ఉన్న నేతల్ని చూస్తే.. పెట్టుకున్నామంటే పెట్టకున్నామన్నట్లుగా మాస్కులు ఉన్నాయే తప్పించి.. ఎవరూ ఆ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు కనిపించరు. అందరి మధ్య మంత్రి కేటీఆర్ మాత్రం ముఖానికి ఏ రీతిలో అయితే మాస్కు పెట్టుకోవాలో.. పక్కాగా పెట్టుకున్నట్లు కనిపిస్తారు.

కేటీఆర్ ధరిస్తున్న మాస్కు పెద్దదిగా ఉండటమే కాదు.. ముఖాన్ని బాగా కవర్ చేసేలా ఉంది. అన్నింటికి మించి కేటీఆర్ ధరిస్తున్న మాస్కులు ట్రెండీగా ఉన్నట్లు చెప్పక తప్పదు. రోజుకో రంగు..డిజైన్ ఉంటున్న కేటీఆర్ మాస్కుల పుణ్యమా అని.. తర్వాతి రోజు ఆయన ఎలాంటి మాస్కు ధరిస్తారన్న చర్చ జరుగుతుండటం గమనార్హం.

Next Story