ఇతను చాలా పేదవాడట..!
By Newsmeter.Network
ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ సినీ ప్రపంచానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా, ఆమె నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది. తాజాగా, సోషల్ మీడియానే హీటెక్కించేలా వార్తతో ముఖ్యాంశాల్లో నిలిచింది. కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంలో అది కాస్తా వైరల్‌గా మారింది.
కాగా, ఒకానొక సమయంలో కృష్ణ ష్రాఫ్ ప్రొఫెషనల్ బాస్కెబాల్ క్రీడాకారుడు ఎబాన్ హైమ్స్‌తో తాను డేటింగ్ చేస్తున్న విషయాన్ని మీడియాకు తెలిపిన విషయం విధితమే. ఎబాన్ హైమ్స్ తనకు చాలా ఏళ్ల కాలం నుంచే తెలసని, అతని వ్యక్తిత్వం, మనసు నచ్చడంతో తనతో డేటింగ్ చేస్తున్నట్టు కృష్ణ ష్రాఫ్ మీడియాకు చెప్పింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలలో వారిద్దరూ చాలా సంతోషకర సమయాన్ని గడుపుతున్నట్టు తెలుస్తుంది.
అంతేకాక, కృష్ణ ష్రాఫ్ తన బికిని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో కృష్ణ ష్రాప్ తన ప్రియుడు ఎబాన్ హైమ్స్‌తో ఓ రేంజ్ రొమాన్స్‌ను పండించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఫోటోలపై నెటిజన్లు ఎవరికిష్టమొచ్చిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏమన్నప్పటికి కృష్ణ ష్రాఫ్ సోదరుడు టైగర్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎబాన్ హైమ్స్‌ను చాలా పేదవాడు అంటూ కృష్ణ ష్రాఫ్ షేర్ చేసిన ఫోటోలకు టైగర్ ష్రాఫ్ కామెంట్ పెట్టాడు.
అదే సమయంలో కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఒక ఫోటోకు "ఇది ఎల్లప్పుడూ నన్ను నవ్విస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది" అని రాసింది. ఇదిలా ఉండగా, మీడియా నివేదికల సమాచారం ప్రకారం, కృష్ణ ష్రాప్, ఎబాన్ హైమ్స్ ఇద్దరూ ఇబాన్ జుహులోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరూ సుమారు 4 నెలలుగా డేటింగ్‌లో ఉన్నారు. తన తల్లి ఆయేషా కూడా ఎబాన్‌ను కలిసిందని కృష్ణ ష్రాఫ్ తన ఇంటర్వ్యూలో చెప్పింది. కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడు ఎబాన్ హైమ్స్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట్లో పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు చాలాసార్లు ఆమె తన ప్రియుడితో కలిసి సోషల్ మీడియాల్ వైరల్ అయింది.