కృష్ణాజిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు

By రాణి  Published on  13 March 2020 1:17 PM IST
కృష్ణాజిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు

  • నూజివీడులో ఒకరు, గన్నవరంలో మరొకరు
  • విజయనగరంలో కరోనా లక్షణాలు లేకపోయినా చికిత్స
  • జర్మనీ, ఢిల్లీ, సింగపూర్ ల నుంచి వచ్చిన అనుమానితులు

కృష్ణాజిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇటీవలే జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గు, జలుబు, జ్వరం..ఇలా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో..ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తికి కరోనా లక్షణాలుండటంతో..అతడిని విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. జర్మనీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి..గురువారం ఢిల్లీ మీదుగా గన్నవరం చేరుకున్నాడు. అక్కడ ఎయిర్ పోర్టులో అధికారులు పరీక్షించగా కరోనా లక్షణాలున్నట్లు స్పష్టమవ్వడంతో..అనుమానిత కేసుగా భావించారు.

Also Read : ఒలింపిక్స్ వాయిదా ?

అలాగే నూజివీడులోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలుండటంతో..అతడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి విస్సన్నపేటలో వస్ర్త వ్యాపారం చేస్తున్న ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు విజయవాడకు తరలించారు.

Also Read : మంచు కాదు.. ఇనుప వాన

కాగా..కరోనా మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో..విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే ఆ యువకుడు సింగపూర్ నుంచి స్వస్థలానికి రావడంతో..వ్యాధి లక్షణాలు లేకపోయినప్పటికీ..24 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.

Also Read : పర్యాటకులపై నిషేధం విధించిన ట్రంప్‌

Next Story