సాధారణంగా పలువురు స్టార్ హీరోయిన్లు, ఫేమస్ సెలెబ్రిటీలు ప్రెగ్నెంట్ అయ్యారంటూ రూమర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని చాలా మంది పట్టించుకోరు. కొందరైతే ఈ విషయాలను కొట్టివేస్తూ ఉంటారు. మరికొందరు వివరణ ఇస్తూ ఉంటారు. కానీ కొర్ట్నీ కర్దాషియన్ టైపులో రిప్లై ఇచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.

కర్దాషియన్ ఫ్యామిలీ మీద వచ్చిన టీవీ షో బాగా పాపులర్. వీళ్లకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్య కొర్ట్నీ కర్దాషియన్ ప్రెగ్నెంట్ అంటూ విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె వేసుకున్న కొన్ని బట్టలను చూసి.. ఆమె తన పొట్టను దాస్తోంది అంటూ కొందరు కథనాలను వెల్లడించారు.

Kourtney Kardashian2

వీటన్నిటికీ సమాధానం చెప్పాలని అనుకుందో ఏమో.. ఏకంగా స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీలో కనిపించి దర్శనమిచ్చింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లైన కొర్ట్నీ కర్దాషియన్ మళ్ళీ తల్లి కాబోతోందంటూ రూమర్లు మొదలవ్వడంతో.. వారందిరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏమీ దాచుకోకుండా.. పూర్తీగా బికినీ లో కనిపించింది. ఓ పూల్ పక్కన పడుకుని సేద తీరుతూ అలా కనిపించింది కొర్ట్నీ కర్దాషియన్. కొర్ట్నీ కర్దాషియన్ కు ఇంస్టాగ్రామ్ లో 90.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో హాట్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఆమె ఫిజిక్ కు అందరూ ఫిదా అవుతూ ఉంటారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.