పుణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను రెండుతో గెల్చుకుంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 275పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. కోహ్లీ వారిని ఫాలో ఆన్ దించాడు. దీంతో..ఫాలో ఆన్‌లోనూ సౌతాఫ్రికా 189 పరుగులకే ఆలౌటైంది. ఎల్గర్‌, బరుమా, ఫిలాండర్‌, కేశవ్ మహరాజ్ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఉమేష్ యాదవ్ నిప్పుల్లాంటి బంతులతో చెలరేగి 3 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా కూడా 3 వికెట్లు పడగొట్టాడు. ఇక.అశ్విన్ రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్ కోహ్లీకి దక్కింది.

Image

Image

భారత్ తొలి ఇన్నింగ్స్ : 601/5
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 275 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 189 ఆలౌట్

ఇన్నింగ్స్ 137 పరుగులతో టీమిండియా విజయం

Image

  • కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయం సాధించడం ఎనిమిదో సారి. కోహ్లీ కంటే ముందు ధోనీ(9) ఉన్నాడు.
  • 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ. 30 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు స్టీవ్‌ వా (37) రికీ పాంటింగ్(35) ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.