కోహ్లీ వ‌న్‌డౌన్‌లో రాకుండా.. దూబేను ఎందుకు పంపాడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 4:47 PM IST
కోహ్లీ వ‌న్‌డౌన్‌లో రాకుండా.. దూబేను ఎందుకు పంపాడంటే..?

విండీస్ తో జరిగిన రెండవ‌ టీ20లో శివమ్ దూబే త‌న బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. కోహ్లీ రావాల్సిన‌ మూడో స్థానంలో వ‌చ్చిన‌ దూబే.. ఆక‌ట్టుకున్నాడు. అయితే.. దూబేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంప‌డానికి గల కార‌ణాల‌ను మ్యాచ్ అనంతరం కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ మ‌ట్లాడుతూ.. తిరువ‌నంత‌పురం గ్రీన్‌ఫీల్డ్ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దూబేను ముందు పంపి.. స్పిన్నర్లపై దాడికి దిగాలని భావించాం. అందుకే దూబేను మూడో స్థానంలో పంపాం. అతడు బాగా ఆడటంతో మా ప్ర‌ణాళిక ఫ‌లించింది. దూబే రాణించ‌డం వ‌ల్ల‌నే ఈ మ్యాచ్‌లో మంచి స్కోరు సాధించగలిగాం" అని అన్నాడు.

అయితే.. వన్‌డౌన్‌లో కోహ్లీకి బదులు వచ్చిన శివమ్ దూబే (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా రెండో మ్యాచ్‌లో మాత్రం ఓట‌మి పాల‌య్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా చెప్పొచ్చు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Next Story