సఫారీలను ఊడ్చేయడానికి 2 వికెట్ల దూరం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 1:01 PM GMT
సఫారీలను ఊడ్చేయడానికి 2 వికెట్ల దూరం..!

  • తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 162 ఆలౌట్
  • బంతులతో నిప్పులు చెరిగిన షమీ, ఉమేష్
  • ఫాలో ఆన్‌లోనూ సౌతాఫ్రికా ఎదురీత
  • రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 132/8

రాంచీ: భారత బౌలర్లను సఫారీలతో రప్ ఆడుతున్నారు. రోహిత్, రహానే బ్యాట్‌తో సఫారీ బౌలర్లను ఆడుకుంటే..బౌలర్లు షమీ, ఉమేష్, నదీమ్, జడేజా బంతితో సఫారీ బ్యాట్స్‌మెన్లకు పగ్గాలు వేశారు. దక్షిణాప్రికా చాలా డిఫెన్స్ లో ఉన్నట్లు కనిపించింది. ఒకే రోజు 16 వికెట్లు చేజార్చుకుంది.

South Africa's Faf du Plessis was clean bowled off India's Umesh Yadav in the first over of the day

Dean Elgar was hit on the helmet by Umesh Yadav and consequently ruled out of the Test. Theunis de Bryun was named as the concussion replacement

సఫారీల గుండెల్లో ఉమేష్, షమీ

మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేష్‌ సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చాడు. డుప్లెసిస్‌(1)ను అవుట్ చేసి సఫారీలకు కంగారు పుట్టించాడు. హంజ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ 62 పరుగులు చేశాడు. బవుమా 32 పరుగులు చేశాడు. దీంతో ఇద్దరు నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. వీరిద్దరూ వెనువెంటనే అవుటవడంతో సౌతాఫ్రికా కస్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో హంజ, నదీమ్ బౌలింగ్‌లో బవుమా అవుటవడంతో సౌతాప్రికా పూర్తిగా డిఫెన్స్‌లోకి పోయింది. క్లాసెన్‌ (6),పీడ్ ,(4)రబడా (0) ఎంత తొందరగా అవుటవుదామా అన్నట్లు అవుటయ్యారు. లిండే(37) ఉమేష్ అవుట్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది.

Zubayr Hamza is clean bowled by India's Mohammed Shami

Mohammed Shami picked up three wickets with the new ball in the second innings

సౌతాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ

సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 162పరుగులకే ఆలౌట్ అవడంతో టీమిండియాకు 335పరుగుల ఆధిక్యత లభించింది. దీంతో సఫారీలను కోహ్లీ ఫాలో ఆన్ ఆడించాడు. భారత్ బౌలర్లు సఫారీలను ఓ ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 36 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయారు. 10 ఓవర్లలోపై 4 వికెట్లు చేజార్చుకున్నారు.

Jadeja picked Zubayr Hamza's wicket to break a 91-run stand in the afternoon session

సౌతాఫ్రికా స్కోర్‌ 5 వద్ద డికాక్ (5)ను ఉమేష్ యాదవ్ అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ తరువాత షమీ తనదైన శైలిలో బంతులు విసురుతూ 3 వికెట్లు పడగొట్టాడు. హంజ, డుప్లెసిస్, బవుమాలను క్రీజ్ నుంచి బయటకు పంపాడు. క్లాసెన్‌ (5)వికెట్ ఉమేష్ కు దక్కింది.జడేజా, అశ్విన్, స్పీన్నర్లుగా తమ వంతు వికెట్లు పడగొట్టారు. లిండె(27) రనౌట్ కావడంతోనే మ్యాచ్‌ భారత్ చేతిలోకి వచ్చేసింది.. ఇక క్రీజ్‌లోబ్రూయిన్ (30), నోర్జే (5) ఉన్నారు. మూడో రోజునే మ్యాచ్ ముగియాల్సి ఉంది. రెండు ఓవర్లు పొడిగించినా ప్రయోజనం లేకపోవడంతో రేపు ఆడాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో సౌతాప్రికా స్కోర్‌ 132/8.

India enforced follow-on for the second time in the series.

Next Story