కోడెల శివరామ్ స్టేట్మెంట్ తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2019 7:44 PM ISTహైదరాబాద్: దివంగత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల మృతి తర్వాత అందుబాటులో లేని కొడెల తనయుడు శివరామ్ స్టేట్మెంట్ ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. తమ ముందు హాజరుకావాలని గతంలో బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చినా శివరామ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు గుంటూరుకు వెళ్లి కోడెల తనయుడు, అతని సతీమణి స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు.
నాన్న మృతికి ఒత్తిడే కారణమని, కేసుల మూలంగానే ఒత్తిడికి గురయ్యారని, నాన్న గారితో ఎలాంటి గొడవలు లేవని కొడెల శివరామ్ తెలిపారు. నాన్న మృతికి ముందే తాను విదేశాలకు వెళ్లానని.. నాన్న చనిపోయాడని కుటుంబ సభ్యులు చేబితేనే తెలిసిందని స్టేట్మెంట్‌లో శివరామ్ వెల్లడించారు.
ఆయన చనిపోవడానికి కొద్దిసేపు ముందు కూడా కలిసి టిఫిన్ చేశామని కోడెల సతీమణి స్టేట్మెంట్‌లో వెల్లడించారు. ఆయన ఎప్పుడూ దేనికి భయపడలేదని, కేసులే ఆయనను ఇబ్బంది పెట్టాయని కోడెల సతీమణి పోలీసుల స్టేట్మెంట్‌లో వెల్లడించారు.