ముఖ్యాంశాలు

  • రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణితోనే ఢిల్లీలో అల్లర్లు
  • పోలీస్‌ ఆఫీసర్‌ను కిరాతకంగా చంపారు-కిషన్‌రెడ్డి
  • పాక్‌, బంగ్లా నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని వ్యాఖ్య

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణమణి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణితోనే ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా-2020’ కాంక్లేవ్‌ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ అల్లర్లలో అంకిత్‌ శర్మ అనే పోలీసు ఆఫీసర్‌ను అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న చొరబాటు దారులు ఇండియాలో విధ్వంసాలు సృష్టిస్తున్నారని అన్నారు. డీమానిటైజేషన్‌, ఆర్టికల్‌ 370, జీఎస్టీ, జన్‌ధన్‌ యోజన వంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు ప్రధాని మోదీ హయాంలోనే వచ్చాయన్నారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకెళ్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఇండియాపై వైపు మళ్లీందని చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక చేస్తున్న నిరసనలు చేస్తున్న కారణంగా పోలీసులు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. షాహీన్‌బాగ్‌తో పాటు పలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు ప్రజలకు తెలియజేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.