ఆ విషయంలో కాంగ్రెస్‌, ఎంఐఎం నోరేందుకు మెదపడం లేదు..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 7:36 AM GMT
ఆ విషయంలో కాంగ్రెస్‌, ఎంఐఎం నోరేందుకు మెదపడం లేదు..!

హైదరాబాద్‌: ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై దాడులు జరిగితే.. కాంగ్రెస్‌, ఎంఐఎం ఎందుకు నోరు మెదపదడం లేదన్నారు కేంద్రహోంశాఖ సహాయకమంత్రి కిషన్‌రెడ్డి. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోని హిందువులు ఎక్కడికి వెళ్లాలో సోకాల్డ్‌ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని కోట్లాది ముస్లిం మహిళలకు మోదీ పెద్దన్న అని వ్యాఖ్యనించారు. సీఏఏపై ముస్లింలను మజ్లీస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పద్మారావునగర్‌లో గృహ సంపర్క్‌ అభియాన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకరెడ్డిలు పాల్గొన్నారు.

అసదుద్దీన్‌ ఒవైసీ ఖబడ్దార్‌ అని పొంగులేటి సుధాకర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నీకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, సీఏఏపై విషప్రచారాన్ని అడ్డుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు.

సీఏఏతో రాజకీయ లబ్దిపొందాలని ఎంఐంఎం చూస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఎంఐఎం కోసమే టీఆర్‌ఎస్‌ పని చేస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. నిన్నటి ఎంఐఎం సభ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీ, ముందు హైదరాబాద్‌ ముస్లింలకు ఎలాంటి భరోసా ఇస్తారో చెప్పాలన్నారు. లేదంటే అసదుద్దీన్‌ ఒవైసీకి తగిన బుద్ది చెబుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.

సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అమరావతి రైతులు కలిశారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ కిషన్‌ రెడ్డి మహిళా రైతులు వేడుకున్నారు. కిషన్‌రెడ్డి వద్ద ఉద్వేగానికి గురైన రైతులు తమను కాపాడాలంటూ కిషన్‌రెడ్డి కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. కాగా రైతులకు సహాయం చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అయినా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రాజధాని రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కిషన్‌రెడ్డి అన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.

Next Story