శభాష్ కిరణ్‌ కుమార్‌ పాసి.. ఆమె ఓ ఐఏఎస్‌ అధికారిణి.. కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 March 2020 10:22 AM GMT
శభాష్ కిరణ్‌ కుమార్‌ పాసి.. ఆమె ఓ ఐఏఎస్‌ అధికారిణి.. కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో..

మ‌న‌లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్ర‌మే తాపత్రయపడతాం. కానీ, గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌లో మాత్రం చ‌దువుకు నో చెప్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాన్ని చుల‌క‌న‌గా భావిస్తాం. కానీ మ‌నంద‌రికి మాత్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావాలి. అయితే ఓ ఐఏఎస్ అధికారిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు.

వివ‌రాల్లోకెళితే.. జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో కిరణ్‌ కుమార్‌ పాసి అనే ప్ర‌భుత్వ అధికారిణి జిల్లా కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. గర్భవతి అయిన ఆమె ప్రభుత్వ ద‌వాఖాన‌లోనే ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పురిటి నొప్పులు రావడంతో.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా సర్కారు దవాఖానకు వెళ్లారు. అక్కడ ఆమె ఓ మ‌గ‌ బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రస్తుతం కిరణ్‌ కుమార్ పాసి, తన బిడ్డతో ఉన్న‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు శ‌భాష్ కిరణ్‌ కుమార్‌ పాసి అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. పాసిని అభినందించ‌డానికి తోటి అధికారులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్నారు.

Next Story