జబర్దస్త్‌ షో .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. వారాల్లో రెండు రోజుల పాటు బజర్దస్త్‌ కామెడీ షోతో తెలుగు ప్రజలు ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారు. పంచు డైలాగులు, డబుల్‌ మీనింగ్‌ మాటలతో షో అంతా రచ్చ రచ్చ జరుగుతుంది. కానీ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చిన ఈ షోపై కిరాక్‌ ఆర్పీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హట్‌ టాపిగ్గా మారాయి. జబర్దస్త్‌ లో దాదాపు మూడేళ్లకుపైగా ఎన్నో స్కిట్స్‌ చేసిన కిరాక్‌ ఆర్పీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కోట్లాది మందిని నవ్విస్తున్న ఈ షో వల్ల చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమను తాము నిరూపించుకుని మంచి పోజిషల్‌లో ఉన్నారు. ఈ జబర్దస్త్‌ షో వల్ల ఎంతో మందికి సినిమాల్లో అవకాశం కూడా వచ్చింది. అలాంటి షోపై నుంచి వచ్చిన కిరాక్ ఆర్పీ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు జబర్దస్త్ షో ఎవడికి లైఫ్‌ ఇవ్వలేదని వ్యాఖ్యనించాడు. లైఫ్‌ ఇవ్వడమంటే ఏం చేయలేని వాడిని తీసుకొచ్చి చేయగలవని ప్రోత్సహించడం అని జబర్దస్త్‌ లో అలా ఎవరూ చేయలేదని ఆర్పీ వ్యాఖ్యనించాడు. వాళ్లకు మేం అవసరం.. అది మాకు ఓ అవకాశం ..అంతేకానీ లైఫ్‌ ఇచ్చేంత సినిమా ఎవరికి లేదని కామెంట్ చేశాడు. అక్కడ అందరిని వాడుకున్నారని చెప్పుకొచ్చాడు. ఎప్పటికీ తాను ఈటీవీ జోలికి గానీ, జబర్దస్త్‌ జోలికి గాని వెళ్లనని అన్నాడు. నా టాలెంట్‌తోనే పైకి వచ్చానని, వాళ్లు ఇచ్చిన అవకాశం యూజ్‌ చేసుకున్నాను.. కానీ ఎవడో పైకి తీసుకొస్తే రాలేదని కామెంట్‌ చేశాడు. జీవితంలో పెద్ద తప్పు చేసింది జబర్దస్త్ షోకు వెళ్లడమేనని అన్నాడు.

కొన్ని రోజులుగా జబర్దస్త్‌ షోలోనే నటించిన ఆర్పీ ఇప్పుడు అక్కడ మానేసి ‘అదిరింది’ షోలో చేస్తున్నాడు. నాగబాబుతో పాటే జబర్దస్త్‌ మానేసి అక్కడికి వెళ్లాడు. కిరాక్‌ ఆర్పీతో పాటు చమ్మక్‌ చంద్ర కూడా అదిరిందిలో చేస్తున్నాడు. కానీ చంద్ర మాత్రం జబర్దస్త్‌ కు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, తనకు లైఫ్‌ ఇచ్చింది చెప్పుకొంటాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.