దుబాయ్‌కి బయలుదేరిన ఆ రెండు ఐపీఎల్ జట్లు.. సీఎస్‌కే పయనం ఎప్పుడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 11:12 AM GMT
దుబాయ్‌కి బయలుదేరిన ఆ రెండు ఐపీఎల్ జట్లు.. సీఎస్‌కే పయనం ఎప్పుడంటే..?

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ కు బయలుదేరిన మొదటి రెండు జట్లుగా కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నిలిచాయి. 13 వ సీజన్ సెప్టెంబర్ 19 నుండి మొదలుకానుంది.

ఎప్పుడు బయలుదేరారో వెల్లడించలేదు కానీ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు దుబాయ్ కు వెళుతున్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేసింది. దుబాయ్ కి బయలుదేరిన విమానంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఉన్న వీడియోలను, ఫోటోలను పోస్టు చేశారు.



కింగ్స్ లెవెన్ పంజాబ్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా విమానంలో బయలుదేరిన ఫోటోను పోస్ట్ చేశాడు. “Apne Munde, off to Dubai.” అంటూ విమానంలో ఫోటోకు పోజును ఇచ్చాడు.



రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా విమాన ప్రయాణానికి తమ ఆటగాళ్లు రెడీ అయ్యారు అంటూ పలు ఫోటోలను పోస్టు చేశారు. పింక్ రంగు మాస్కులను ధరించిన ఆటగాళ్లు పీపీఈ కిట్స్ ను ధరించి ఎయిర్ పోర్టులో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగష్టు 21న దుబాయ్ కు బయలుదేరుతుందని ఆ జట్టు సీఈఓ కాశి విశ్వనాథన్ తెలిపారు.

ఐపీఎల్ 13 ఎడిషన్ మొత్తం 53 రోజుల పాటూ జరగనుంది. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకూ మూడు స్టేడియంలలో ఐపీఎల్ లో జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లలో ఐపీఎల్ ను నిర్వహించనున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్ వీకెండ్ లో కాకుండా వీక్ డేలో జరగనుంది. సాధారణంగా నిర్వహించే సమయం కంటే అరగంట ముందు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో తలపడనుంది. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. బీసీసీఐ ఇంకా పూర్తీ షెడ్యూలును విడుదల చేయలేదు. గ్రౌండ్ లోకి అభిమానులను దాదాపుగా అనుమతించడం లేనట్లేనని అంటున్నారు.

Next Story