కొత్తిమీరతో కిడ్నీ సమస్యలకు చెక్.!
By సుభాష్ Published on 4 April 2020 7:28 AM ISTదేశంలో వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి, నిద్రలేని, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో కిడ్నీసమస్యలతో బాధపడేవారు కూడా చాలానే ఉన్నారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
కషాయం తయారు చేసుకోవడానికి గుప్పెడు కొత్తిమీర, గ్లాసు మంచినీళ్లేనని చెబుతున్నారు.
ముందుగా నీటిలో కొత్తమీర వేసి బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. ఇలా ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటల తాగుతూ.. వరుసగా 40 రోజుపాటు వాడి.. ఆ తర్వాత 10 రోజులు మానేసి మళ్లీ మొదటు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పలు రకాల కీడ్నికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్న సమయంలో క్రియాటివ్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కాలంటే కొత్తమీర కషాయం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.