ఖ‌మ్మం జిల్లాలో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2020 7:35 AM GMT
ఖ‌మ్మం జిల్లాలో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

మ‌హిళ‌ల ర‌క్షణ కోసం ఎన్నో చ‌ట్టాలు రూపొందించిన కామాంధుల బారీ నుంచి వారిని కాపాడ‌లేక‌పోతున్నాయి. అభం శుభం తెలియ‌ని చిన్నారులు సైతం ఆ పిశాచాల రాక్ష‌స‌త్వానికి బ‌ల‌వుతున్నారు. ఖ‌మ్మం జిల్లాలో దారుణం జ‌రిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై 18 ఏళ్ల యువ‌కుడు అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

ఖ‌మ్మం జిల్లా తిరుమ‌లాయాపాలెం మండ‌లంలోని ఓ గ్రామంలో శ‌నివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తొమ్మిదేళ్ల చిన్నారి త‌ల్లిదండ్రులు ప‌ని మీద వేరే గ్రామానికి వెళ్లారు. ఇంట్లో బందువులు ఉండ‌డంతో పాపను జాగ్ర‌త్తగా చూసుకోమ‌ని చెప్పి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు(18) పాప పై క‌న్నేశాడు. త‌న సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తాన‌ని చెప్పి పాప‌ను శ‌నివారం రాత్రి డాబా పైకి తీసుకెళ్లాడు.

అక్క‌డ బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక‌కు తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. త‌ట్టుకోలేక ఆ చిన్నారి కేక‌లు వేసింది. దీంతో స్థానికులు అక్క‌డ‌కు వెళ్లారు. వారిని గ‌మ‌నించిన ఆ యువ‌కుడు అక్క‌డ నుంచి అప్ప‌టికే పారిపోయాడు. వెంట‌నే పాప‌ను స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా.. వారి సూచ‌న‌ల మేర‌కు ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప్ర‌తికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం పాప ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it