ఆ క్రికెటర్ కొట్టిన భారీ సిక్సర్.. అతడి కారు అద్దాలనే ధ్వంసం చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 11:29 AM IST
ఆ క్రికెటర్ కొట్టిన భారీ సిక్సర్.. అతడి కారు అద్దాలనే ధ్వంసం చేసింది

కొందరు ఆటగాళ్లకు భారీ సిక్సర్లు కొట్టడం అలవాటు..! అలా కొట్టడం వలన కొన్ని సార్లు గ్రౌండ్ లో ఉన్న అభిమానులకు కూడా గాయాలు అయ్యేవి. మరికొన్ని సార్లు గ్రౌండ్ బయట ఉన్న వస్తువులకు తగిలి జరగాల్సిన నష్టం జరిగిపోయేవి. ఎన్నో సార్లు ఎంతో మంది ఆటగాళ్లు కార్ల అద్దాలు పగులకొట్టారు. ఈసారి ఐర్లాండ్ క్రికెటర్ 'కెవిన్ ఓబ్రియాన్' కూడా భారీ సిక్సర్ ను బాదాడు.. ఆ బంతి స్టేడియం బయట పార్క్ చేసి ఉన్న కారు మీద పడడంతో అద్దం కాస్తా బద్దలైంది. తీరా చూస్తే ఆ కారు మరెవరిదో కాదు కెవిన్ ఓబ్రియాన్ దే..! తాను కొట్టిన భారీ సిక్సర్ వలనే తనకే నష్టం కలిగిందని తెలుసుకున్నాడు కెవిన్ ఓబ్రియాన్.

కెవిన్ ఓబ్రియాన్ డబ్లిన్ లో జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్ లో 37 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అందులో 8 సిక్సర్లను బాదాడు. ఆ సిక్సర్లలో ఓ భారీ సిక్సర్ పెమ్బ్రోక్ క్రికెట్ క్లబ్ బయట పార్కింగ్ ప్రాంతం మీదుగా వెళ్ళింది. అక్కడ చూస్తే ఏదో అద్దం పగిలిన సౌండ్.. తీరా చూస్తే ఓ కారు వెనుక భాగంలో ఉన్న అద్దం ధ్వంసం అయింది. ఆ కారు కాస్తా కెవిన్ ఓబ్రియాన్ దే..! తన జట్టుకు ఓ వైపు కెవిన్ విజయాన్ని అందించగా.. మరో వైపు ఇలా తన కారు అద్దాన్ని తానే పగులగొట్టుకున్నాడు.

తన కారు అద్దాన్ని తానే పగులగొట్టాడంటూ క్రికెట్ ఐర్లాండ్ ఫోటోను పోస్టు చేసింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మరో ట్వీట్ చేసింది.



Next Story