విజయవాడ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కేశినేని శ్వేత..
By అంజి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ ఉదయం నామినేషన్ పత్రాలకు వినాయకు గుడి, కనకదుర్గమ్మ గుడిలో పూజలు చేయించారు. టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత.. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని రెండవ కూమార్తె. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి కేశినేని శ్వేత నామినేషన్ వేయనున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో తండ్రి కేశినేని గెలుపు కోసం శ్వేత విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమె అమెరికాలోనూ అధ్యక్ష పదవికి పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విజయవాడ పార్టీ నేతలతో చర్చించి టీడీపీ అధినాయకత్వం ఈ నిర్ణం తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడ మేయర్ పీఠాన్ని టీడీపే గెలుస్తుందని కేశినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ పతనం కూడా విజయవాడ ఎన్నికలతోనే మొదలవుతుందని ఆయన అన్నారు. మేయర్ అభ్యర్థిగా తన కుమార్తెను ప్రకటించడంతో కేశినేని ఫుల్ జోష్‌లో ఉన్నారు.
విజయవాడ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ తీవ్ర కసరత్తు తర్వాత మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను నియమించింది. కాగా మున్సిపల్ ఎన్నికలకు నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.