కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్.. రూ.5 కోట్ల చెక్కు అందజేత
By సుభాష్ Published on 22 Jun 2020 10:48 AM GMTభారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్లిన కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. సంతోష్ భార్య సంతోషికి రూ.4 కోట్లు, తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. అంతేకాకుండా కల్నల్ సంతోష్ బాబు భార్యకు గ్రూప్ -1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా సీఎం అందజేశారు. అలాగే హైదరాబాద్‌లో 650 గజాల నివాస స్థలానికి సంబంధించి పత్రాలను సైతం స్వయంగా అందజేశారు కేసీఆర్. అలాగే కల్నల్ సంతోష్‌బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అలాంటి వీరుడిని ఇచ్చిన కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. సందర్భంగా సంతోష్ చిత్రపటానికి కేసీఆర్ నివాళులు అర్పించారు.
కాగా, ఈ ఘర్షణలో అమరులైన మిగతా 19 మంది కటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ శాఖ ద్వారా అందజేస్తామని వెల్లడించారు