కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ అర్ధం చేసుకోవడం లేదు: రేవంత్ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 10:39 AM GMT
కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ అర్ధం చేసుకోవడం లేదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కేటీఆర్‌ ఎప్పుడు స్వయం ప్రకాశిత లీడర్‌ కాదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో గెలిచి.. దానిని సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెకు ఎలా ముడిపెడతారని రేవంత్‌ ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధి అంటున్నా సీఎం కేసీఆర్‌.. గతంలో కొడంగల్‌లో కూడా అలాగే చెప్పారన్నారు. అయితే ఇప్పటి వరకు కొండంగల్ నియోజకవర్గానికి ఎంత నిధులు మంజూరు చేశారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలన ముగింపుకు సందేశం ఇవ్వడానికే కవితను ప్రజలు ఒడగొట్టారని.. అయిన ఈ విషయం కేసీఆర్‌కు అర్థం కాలేదన్నారు. తెలంగాణను నిజాం నవాబు అభివృద్ధి చేశారు. అయిన ప్రజలెందుకు తిరుగుబాటు చేశారో తెలుసుకోవాలన్నారు. రామారావు ఎంత చేసిన ఓడించారు, అసలు తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ.. తిరుగుబాటు కాదని పేర్కొన్నారు. ఆనాడు కొమురం భీం, చాకలి ఐలమ్మ, రాంకి గోండు, సర్వాయి పాపన్న వంటి వారు కూడా పోరాడింది స్వేచ్ఛ కోసమేనని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆర్టీసీలో హరీష్‌ రావు, సింగరేణిలో కవిత గెలిచినప్పుడు యూనియన్లు ఎందుకు రద్దు చేయలేదని కేసీఆర్‌ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో వెల్ఫేర్‌ ఏనాడు ఆగలేదు.. కాకపోతే ఎప్పటికప్పుడు ఉన్న బడ్జెట్‌ని బట్టి సంక్షేమం అమలు చేశారని ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు రూ.1000 కోట్లతో, నాగార్జునసాగర్‌ రూ.130 కోట్లతో నిర్మాణం పూర్తయిందన్న రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి కాకపోవడం కేసీఆర్‌ పాలనకు దార్శనికతను సూచిస్తుందన్నారు.

Next Story