తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత
By రాణి Published on 30 March 2020 9:12 PM IST
కరోనా సృష్టించిన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 75 శాతం వరకూ కోత పడనుంది.
Also Read : కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల జీతాల్లో 75 శాతం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ జీతాల్లో 60 శాతం, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పడనుంది. అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 50 శాతం, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్ రిటైర్డ్ పెన్షన్ లో 10 శాతం కోత విధించనుంది ప్రభుత్వం. ఉద్యోగుల జీతాల్లో కోత విధింపు ద్వారా కరోనా టైం లో వచ్చిన నష్టాల్ని అధిగమించవచ్చన్నది ప్రభుత్వం ఎత్తుగడ. కరోనా కారణంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేకపోవడంతో జీతాల్లో కోత విధించక తప్పట్లేదని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read :వినాశకాలే విపరీత బుద్ధిః : మోహన్ బాబు