వినాశకాలే విపరీత బుద్ధిః : మోహన్ బాబు

By రాణి  Published on  30 March 2020 2:57 PM GMT
వినాశకాలే విపరీత బుద్ధిః : మోహన్ బాబు

భూ మండలాన్నంతటినీ వణికిస్తున్న అతి చిన్న వైరస్ కరోనా. వైరస్ చిన్నదే కానీ..ఇది సృష్టించే అనర్థం మాత్రం ఊహించలేం. అలాంటి వైరస్ ను కట్టడి చేసేందుకు అంతా లాక్ డౌన్ అయింది. సామాజిక దూరమే ప్రస్తుతం వైరస్ కు విరుగుడు. దీని గురించి చాలా మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని సహా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కరోనా గురించి ఓ పిట్ట కథ..చిన్న కథ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

Also Read : వారి ప్రేమకు కరోనా కూడా ఫిదా అయింది..

'' ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. ప్రకృతిని గౌరవించాలని..ఏదొక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తుందన్న విషయం అర్థమై ఉంటుంది. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసుంటుంది. అయినా ఓ చిన్న కథ..భారత భాగవత, రామాయణాలను మీరు చదివుంటారు. రామాయణంలో వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. వాళ్లిద్దరూ గొడవపడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు. వెంటనే సుగ్రీవుడు మళ్లీ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య..ఏవండీ..! వద్దు, ఇప్పుడే వెళ్లారు. రక్తపు మరకలు కూడా ఆరి ఉండవు. వెంటనే మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నారంటే ఇందులో ఏదో మర్మం ఉంది. వద్దు అని చెప్పింది. అయినా సుగ్రీవుడు భార్య మాట వినకుండా యుద్ధానికి వెళ్లాడు. అంటే..వినాశకాలే విపరీత బుద్ధిః..మంచి రుచించలేదు. వెళ్లి యుద్ధంలో ఓడిపోయి తనువు చాలించాడు. అలాగే సీతాదేవి..లక్ష్మణరేఖను దాటి కష్టాలపాలైంది. ఇప్పుడు కరోనా టైం లో మనదేశ ప్రధాని నుంచి అందరూ చెప్తున్నారు. గడప దాటొద్దని. అయినా వినట్లేదు. ఎన్నిరోజులు లాక్ డౌన్ అయితే అన్ని రోజులు ఇంట్లో సుఖంగా ఉండండని చెప్తుంటే..పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. దయ చేసి పెద్దల మాటలను గౌరవించండి. మనం, ఇంటిపక్కవారు, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది'' అని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.



Next Story