• అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా టెస్టులు చేయగా..వారికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ కె.శశాంక వెల్లడించారు. జిల్లాలో ఇండోనేషియా బృందంతో తిరిగిన వ్యక్తికి ఇటీవలే పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచగా..వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. బాధిత వ్యక్తి తల్లి, సోదరికి కూడా కరోనా ఉన్నట్లు నిర్థారణైందని కలెక్టర్ తెలిపారు.

వినాశకాలే విపరీత బుద్ధిః : మోహన్ బాబు

కాగా..వారితో కలియ తిరిగిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. ముకురంపురా ప్రాంతంలో మరోసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి ప్రతి వ్యక్తి కి హెల్త్ స్క్రీనింగ్ చేస్తారన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటి వరకూ కరీంనగర్ లో 105 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంలో అత్యధిక కరోనా టెస్టులు చేసింది కరీంనగర్ లో నే అని కలెక్టర్ చెప్పారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.