ప్రశ్నలకు తెరదించుతూ.. ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
By తోట వంశీ కుమార్ Published on 11 July 2020 7:04 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉన్నారు. కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన రైతులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడ.? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షనేతలు సైతం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని.. ఆయన ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ కు చేరుకొని కేసీఆర్ ఎక్కడ అంటూ ప్లకార్డు లు పట్టుకున్నారు. 'వేర్ ఈజ్ సీఎం' అంటూ హై కోర్ట్ లో సైతం పిటిషన్లు దాఖలయ్యాయి. సార్ ఎక్కడ? ఏమైంది? కరోనా వైరస్ తీవ్రత వేళ కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి. వీటన్నింటికి తెరదించుతూ.. కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.