హుజూర్ నగర్ సభలో కేసీఆర్ వరాల జల్లు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
హుజూర్‌నగర్: 'ప్రజా కృతజ్ఞత సభ'లో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నట్లు ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అంతేకాదు..గిరిజన ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఎక్కువ మందికి ఇస్తామన్నారు. కాగా, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు .