కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం

By సుభాష్  Published on  10 July 2020 3:02 PM IST
కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది. పొలిటికల్‌ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్‌ను హెచ్చరించింది. కేసీఆర్‌ కనిపించకపోతే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది.

కాగా, కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని తెలంగాణ హైకోర్టులో జూలై 8న మాండమస్‌ పిటిషన్‌ దాఖలైంది. నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రగతి భవనంలో 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అప్పటి నుంచి కేసీఆర్‌ ఫాంహౌస్‌కు వెళ్లారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారవు శత జయంతి రోజు కేసీఆర్‌ చివరిసారిగా మీడియా ముందుకు వచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా దాఖలైన ఈ పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story