కేంద్రం ప్యాకేజీపై కేసీఆర్‌ మండిపాటు

By సుభాష్  Published on  19 May 2020 2:52 AM GMT
కేంద్రం ప్యాకేజీపై కేసీఆర్‌ మండిపాటు

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ సడలింపులపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మే 31 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ బస్సులకు అనుమతిస్తూ, షాపులన్ని తెరుచుకోవచ్చని ప్రకటించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వంపై రూ. 20 లక్షల కోట్ల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ అంతా బోకసేనని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీ అంతా అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని అన్నారు. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా.. అంటూ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రరపు ఆంక్షలు పెట్టారని ధ్వజమెత్తారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్యాకేజీ పెద్ద మోసమన్నారు.

ఆర్థికంగా కుంగిపోతున్న సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా.. అంటూ మండిపడ్డారు. ప్యాకేజీ అనేది ఒట్టి డొల్ల అని, ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్షకోట్లు కూడా లేవని ఆరోపించారు. కరోనా విపత్తు సమయంలో రాష్ట్రాలకు నగదు రావాలి.. అది అడిగితే రాష్ట్రాలను భిక్షగాళ్లుగా భావించిందని అన్నారు.

Next Story