ఈ నెల 9 నుంచి కేబీసీ-12వ సీజ‌న్ రిజిస్ట్రేషన్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 5:20 PM IST
ఈ నెల 9 నుంచి కేబీసీ-12వ సీజ‌న్ రిజిస్ట్రేషన్లు

భార‌త దేశ వ్యాప్తంగా అల‌రిస్తున్న కార్య‌క్ర‌మం 'కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి'(కేబీసీ). దాదాపుగా ఈ ప్రోగాం గురించి తెలియ‌ని వ్య‌క్తి ఉండ‌డు. హిందీతో ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మం 11 సీజ‌న్ల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. 12వ సీజ‌న్‌కు అడుగులు వేస్తోంది. ఈ 12వ సీజ‌న్ కేబీసీ రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంద‌ని జీ టీవీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వెల్ల‌డించింది. లాక్‌డౌన్‌ మధ్యనే ప్రేక్షకుల ముందుకు రావాలన్న తపనతో పనులను శ‌రవేగంగా పూర్తిచేస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఇటీవ‌ల ముంబైలో జ‌రిగింది. రెండు రోజుల షూటింగ్‌ను కేవ‌లం ఒకే రోజులో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రోమో షూటింగ్‌ అమితాబ్‌ ఇంటి నుంచి జరుగగా.. రిమోట్‌ ద్వారా దంగల్‌ హల్మర్‌ నితేశ్‌ తివారి డైరెక్షన్‌ చేశారు. మోకాలి కండరాల నొప్పి బాధించినప్పటికీ.. అందరి అభిమానంతో షూటింగ్‌ పూర్తిచేయగలిగానని తెలిపారు.

Next Story