ఫోన్ నేలకేసి పగులగొట్టిన కౌశల్.. ఎందుకో ఇంతకోపం తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2020 1:52 PM ISTకౌశల్ మండా.. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అతడికి వచ్చిన ఫేమ్ మరెవరికీ రాలేదనుకోండి. బిగ్ బాస్-2 విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత తాను మోసపోయానని.. కొందరు కావాలనే మోసం చేశారని.. తన చుట్టూ కుట్రలు జరిగాయంటూ కూడా కౌశల్ మీడియాకు ఎక్కాడు. తాజాగా కౌశల్ మొబైల్ ఫోన్ ను పగులగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకూ కౌశల్ మొబైల్ ఫోన్ ను ఎందుకు పగులగొట్టాడో తెలుసా..?
దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతోంది. చైనాకు చెందిన వస్తువులను వాడకూడదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో తన వంతుగా కౌశల్ తన దగ్గర ఉన్న చైనా ఫోన్ ను పగులకొట్టాడు. తాను చైనా ప్రోడక్ట్స్ ను వాడాలని అనుకోవడం లేదన్నదానికి సాక్ష్యం ఈ వీడియో అంటూ తన అకౌంట్ లో షేర్ చేశాడు కౌశల్. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో గెలుచుకున్న ఒప్పో మొబైల్ ఫోన్ ను నేలకేసి కొట్టాడు కౌశల్. తన ఇంట్లో బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ గట్టిగా కిందకి విసిరేశాడు. దీంతో ఆ మొబైల్ ఫోన్ కాస్తా ముక్కలు ముక్కలు అయింది. వెంటనే దాన్ని తీసుకుని డస్ట్ బిన్ లో వేసేశాడు కౌశల్. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కౌశల్ చేసిన పనికి చాలా మంది నుండి మద్దతు లభిస్తోంది.