ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న వివాహేతర సంబంధం.. అనాథలైన ఇద్దరు పిల్లలు

By సుభాష్  Published on  24 Feb 2020 4:23 PM GMT
ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న వివాహేతర సంబంధం.. అనాథలైన ఇద్దరు పిల్లలు

వివాహేత సంబంధం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్యకు విషం ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసిన వైద్యుడి అపై తానూ ఆత్మహత్యకు ఒడిగట్టాడు. వైద్యుడితో వివాహేత సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్‌, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు చెందిన డాక్టర్‌ రేవంత్‌ ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరునెలల చిన్నారి, ఐదేళ్ల కుమారుడున్నారు. రేవంత్‌ డెంటల్‌ క్లీనిక్‌ నడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ ప్రాంతంలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నహర్షిత (32), రేవంత్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో హర్షితను తనవద్దకు వచ్చేయాలని ఒత్తిడి తీసుకువచ్చేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో డాక్టర్ భార్య కవిత ఈనెల 17వ తేదీన అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్యను ఎవరు చంపేశారని పోలీసులకు సమాచారం అందించాడు భర్త. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇక పోస్టుమార్టం రిపోర్టులను చూసి పోలీసులు షాకయ్యారు. కవితకు భర్త రేవంత్‌ మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీంతో రేవంత్‌ను విచారణ నిమిత్తం అతని ఫోన్‌ కాల్స్‌ డేటాను బయటకు తీశారు. ఇక అసలు విషయం బయటపడుతుందనే భయంతో డాక్టర్‌ రేవంత్‌ 21వ తేదీన రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అక్రమ సంబంధం కొనసాగిస్తున్న హర్షితకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు.

ఇక, రేవంత్‌ ఆత్మహత్య చేసుకున్న కొద్ది సేపటికే హర్షిత కూడా తన నివాసంలో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య పాల్పడింది. ఇలా వివాహేతర సంబంధం వల్ల ముగ్గురి ప్రాణాలు పోవడమే కాకుండా రేవంత్‌కు ఉన్న ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వీరి వల్ల పిల్లలు అనాథలుగా మారిపోవడంతో ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Next Story
Share it