11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిని హత్య చేసిన బాధితురాలి అన్న

By సుభాష్  Published on  30 Dec 2019 8:19 PM IST
11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిని హత్య చేసిన బాధితురాలి అన్న

నిర్భయ, దిశ ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి హత్యలు, అత్యాచారాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా..కామాంధుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. బసవేశ్వర్‌ నగర్‌కు చెందిన పక్రుద్దీన్‌ నదాఫ్‌ 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పక్రుద్దీన్‌ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అత్యాచారం జరిపిన అనంతరం బాలికను వాళ్ల ఇంటికి తీసుకువస్తుండగా, కుటుంబ సభ్యులు గమనించి దేహశుద్ది చేశారు.

అనంతరం సాయంత్రం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితున్ని చికిత్సనిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఇక కోపంతో రగిలిపోయిన బాలిక సోదరుడు ఆస్పత్రికి వచ్చి నిందితుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో బాలిక సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు.

Next Story