కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం..బెంగళూరులో ట్రయల్
By రాణి Published on 21 April 2020 10:38 PM ISTరాష్ట్రంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించింది. లాక్ డౌన్ వేళల్లో కూడా ప్రజలు నిత్యావసరాలు, మందులు..అవీ ఇవీ అంటూ బయట తిరుగుతుండటం వల్ల వైరల్ ప్రబలే అవకాశముండటంతో ఇకపై ప్రతి ఒక్కరికి ఇళ్లకే కావాల్సిన సరుకులు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఒక వాట్సాప్ నంబర్ ను ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం 08061914960 వాట్సాప్ సేవలను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఉన్న ఏజెంట్లు నేరుగా సరుకులను ఇళ్లకు చేరవేస్తారని ఆయన తెలిపారు. తొలుత దీనిని బెంగళూరులో ప్రయోగించి చూశాక మిగతా ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామన్నారు. బెంగళూరులో నిత్యావసరాలు అంజేసేందుకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న 5000 మందిని నియమించినట్లు పేర్కొన్నారు.
Also Read : ఆదుకోవాల్సిన సమయంలో..ప్రజల ప్రాణాలతో చెలగాటమా ?
08061914960 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని HI అని మెస్సేజ్ పెట్టి మీ లొకేషన్ లేదా అడ్రస్ వివరాలను ఆ నంబర్ కు షేర్ చేయాలి. తర్వాత మీకు నిత్యావసర వస్తువులు కావాలా ? లేదా మెడిసిన్ కావాలా ? అని మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు కావాల్సిన సరుకులు లేదా మెడిసిన్ లిస్ట్ ను టైప్ చేసి గానీ, పేపర్ మీద రాసి గానీ పంపించాలి. మీ ఆర్డర్ రిసీవ్ అని రిప్లై వస్తుంది. అనంతరం మీరిచ్చిన లిస్ట్ ప్రకారం ఏజెంట్ మీ ఇంటికే సరుకులు తీసుకొచ్చి ఇస్తారు. బిల్లు తో పాటు అదనంగా రూ.10 ఏజెంట్ కు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : వావ్..మహేష్ యంగ్ లుక్, నెటిజన్లు ఫిదా