వావ్..మహేష్ యంగ్ లుక్, నెటిజన్లు ఫిదా

By రాణి  Published on  21 April 2020 12:19 PM GMT
వావ్..మహేష్ యంగ్ లుక్, నెటిజన్లు ఫిదా

సూపర్ స్టార్ మహేష్ ..ఆ పేరుకు ఉండే క్రేజే వేరు. మురారితో మగువల మనసుల్ని దోచుకున్న మహేష్ కు పెళ్లై 15 సంవత్సరాలై ఇద్దరు పిల్లలున్నా ఇంకా కుర్ర హీరోగానే టాలీవుడ్ ను ఏలుతున్నాడు. ఇటీవలే వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్..ఇప్పుడు లాక్ డౌన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. క్వారంటైన్ లో కొడుకు గౌతమ్ తో వీడియో గేమ్స్ ఆడుతూ..సితార పాపకు కబుర్లు చెప్తూ అప్పుడప్పుడూ ఆ విశేషాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నాడు.

Also Read : మతపెద్దలను ఆదుకునేందుకు ఏపీ ప్రత్యేక జీఓ

మహేష్ కన్నా నమ్రతే ఇలాంటి వాటి గురించి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. కానీ ఈ మధ్య లాక్ డౌన్ పుణ్యమా అని మహేష్ కూడా ఇన్ స్టా లో కుటుంబానికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. మంగళవారం సితా పాపతో దిగిన క్యూట్ సెల్ఫీని ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. #stayhome #staysafe #staystrong హ్యాష్ టాగ్ లతో పోస్ట్ చేసిన ఈ సెల్ఫీలో మహేష్ క్లీన్ షేవ్ తో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లు ఫొటోలో ఉన్నది మహేష్ ఆ లేక గౌతమ్ ఆ అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : వైద్యుల నిర్లక్ష్యం..విడిపోయిన బిడ్డ తల, మొండెం

Next Story
Share it